గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని జీవం ఉట్టిపడేలా అనకాపల్లికి చెందిన ఓ శిల్పి తయారు చేశారు. విశాఖకు చెందిన ఓ అభిమాని బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని తయారు చేయమని కోరగా... చూపరులను ఆకట్టుకునేలా తయారు చేశానని శిల్పి కామదేనుపు ప్రసాద్ అన్నారు. మట్టితో విగ్రహాన్ని తయారు చేసి దీనికి ఫైబర్ గ్లాస్ అద్ది.. కాంస్య విగ్రహాన్ని తయారు చేసినట్లు శిల్పి తెలిపారు.
జీవం ఉట్టిపడేలా ఎస్పీ బాలు విగ్రహం తయారీ - anakapalle latest news
అనకాపల్లికి చెందిన శిల్పి కామదేనుపు ప్రసాద్.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు కాంస్య విగ్రహాన్ని ఎంతో ఆకర్షణీయంగా తయారు చేశారు. విశాఖపట్నానికి చెందిన ఓ అభిమాని కోరడం వల్ల విగ్రహాన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆకర్షణీయంగా విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి ప్రసాద్