ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏఓబీలో ఎదురుకాల్పులు... ముగ్గురు మావోయిస్టులు మృతి - ఏవోబీలో ఎదురుకాల్పులు... ఐదుగురు మవోయిస్టులు మృతి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తుపాకి చప్పుళ్లతో అలజడి...రేగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మవోలు మృతి చెందారు.

aob-encounter-5-maoist-died

By

Published : Sep 22, 2019, 5:16 PM IST

Updated : Sep 22, 2019, 7:41 PM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో తుపాకి చప్పుడుతో ఒక్కసారిగా వాతావరణం మారింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. మదిమల్లు వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు విశాఖ గ్రామీణ ఎస్పీ బాబూజీ తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.ఘటనాస్థలంలో4తుపాకులు, ల్యాండ్‌మైన్‌, కిట్‌బ్యాగ్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. స్పెషల్ పార్టీ,గ్రేహౌండ్స్,సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో గ్రేహౌండ్స్, ఎస్పీఎఫ్ బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి. కూంబింగ్‌ సందర్భంగా తారసపడిన మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య అరగంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలాన్ని ఓఎస్‌డీ కృష్ణారావు, ఏఎస్పీ సతీశ్‌కుమార్‌ పరిశీలించారు.

ఇదీ చదవండి: ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు

Last Updated : Sep 22, 2019, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details