వసతి గృహాలు తెరవాలని విద్యార్థి సంఘాల ఆందోళన - వసతి గృహాలు తెరవాలని నిరసన
డిగ్రీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు తెరవాలని డిమాండ్ చేస్తూ...అఖిల భారత విద్యార్థి సమాఖ్య విశాఖలో ఆందోళన చేపట్టింది.
![వసతి గృహాలు తెరవాలని విద్యార్థి సంఘాల ఆందోళన Anxiety to open hostel at visakhapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9242182-596-9242182-1603189919456.jpg)
డిగ్రీ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు తెరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య విశాఖలో ఆందోళన చేపట్టింది. కరోనా నేపథ్యంలో మూసివేసిన వసతి గృహాలను వెంటనే తెరిపించకపోవటంతో దూరం నుంచి వచ్చే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని...విద్యార్థి సమాఖ్య నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే వసతి గృహాలు తెరిపించాలని విజ్ఞప్తి చేస్తూ గాంధీ పార్క్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చదవండి: