మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేయటానికి..ఓ పక్క వారం రోజులుగా మావోయిస్టు పార్టీ కసరత్తు చేస్తుండగా... మీరు ఎందుకు ఎవరి కోసం నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ ఆదివాసీ అభివృద్ధి సమితి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
సామాజిక మాధ్యమాల్లో మావోయిస్టు వ్యతిరేక వీడియో హల్చల్ - మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం వార్తలు
మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.... మావోయిస్టులకు వ్యతిరేకంగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎందుకీ వారోత్సవాలంటూ...ఈ వీడియోలో ఆదివాసీ అభివృద్ధి సమితి మావోయిస్టులను ప్రశ్నించింది.
![సామాజిక మాధ్యమాల్లో మావోయిస్టు వ్యతిరేక వీడియో హల్చల్ anti-maoist-video-hustle-on-social-media](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8890343-244-8890343-1600750242967.jpg)
మావోయిస్ట్ వ్యతిరేక వీడియో హల్చల్
సామాజిక మాధ్యమాల్లో మావోయిస్ట్ వ్యతిరేక వీడియో హల్చల్
ఆదివాసీ అభివృద్ధి సమితి పేరుతో చేసిన ఈ వీడియోలో మావోయిస్టులు చేసిన ఇన్ఫార్మర్ హత్యలు, విధ్వంస సంఘటనలు చూపిస్తూ... ఇవి చేశామని చెప్పడం కోసమా మీరు వారోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ ఆ వీడియోలో ప్రశ్నించారు. మారుమూల గ్రామాలకు రహదారులు వేస్తే అడ్డుకుంటారు.. ఇదేనా మీరు చూపించిన ప్రగతి అంటూ మావోయిస్టులను ప్రశ్నించారు.