ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దివ్య హత్య కేసులో మరో సంచలన కోణం! - విశాఖలో దివ్య హత్య కేసు తాజా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా సంచనలం స్పష్టించిన దివ్య దారుణ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దివ్య ఉదంతం... ఐదేళ్ల క్రితం జరిగిన హత్యల విషయంలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. అసలు ఆమె కుటుంబంలో కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతోంది? అనే విషయంపై పోలీసులు దృష్టి సారించేలా చేస్తోంది. దివ్య పిన్ని కాంతవేణి చెప్పిన విషయాలు... అసలు నిజాలు కాదనే అనుమానాలు పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Divya Murder Case
Divya Murder Case

By

Published : Jun 14, 2020, 8:38 PM IST

విశాఖ అక్కయ్య పాలెంలో ఈ నెల 3న జరిగిన దారుణ హత్య రోజుకో మలుపు తిరిగింది. హత్యతో సంబంధం ఉన్న నిందితులతో పాటు దివ్య అనైతిక వృత్తిలోకి అడుగు పెట్టడానికి కారణంగా భావిస్తూ ఆమె పిన్ని, బాబాయి, భర్తను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే వీరి పాత్రపై పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దివ్య కుటుంబానికి ఏమైంది?

దివ్య కుటుంబం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉండేది. ఆమె తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్లిపోవటంతో పిన్ని కాంతవేణితో కలిసి ఉండేవారు. కాంతవేణి భర్త, నల్ల మహారాజు అనే వ్యక్తితో కలిసి దొంగతనాలు చేస్తుండేవాడు. అయితే దివ్య తండ్రిలానే కాంతవేణి భర్త కూడా కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు. వారు ఇద్దరు ఎందుకు వెళ్లిపోయారు?... ఎటు వెళ్లారు?... అనేది ఇప్పటికీ తెలియదు. ఇంతలోనే దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ అదృశ్యమయ్యారు.

వారు హత్యకు గురయ్యారా?

2014 జూన్ 21 దివ్య, కాంతవేణి బయటకు వెళ్లి వచ్చే సరికి ఇంటిలో ఆ ముగ్గురు కనిపించలేదు. అప్పటికి దివ్య తల్లి వయసు 28 సంవత్సరాలు, తమ్ముడి వయసు 10 సంవత్సరాలు, అమ్మమ్మకు 45 సంవత్సరాలు. ఈ ముగ్గురు కనిపించకుండా పోయినా దివ్య పిన్ని మాత్రం చాలా రోజుల వరకు పోలీసులను ఆశ్రయించలేదు. ఎట్టకేలకు జులై 6న ఫిర్యాదు చేసింది. అదే సంవత్సరం అక్టోబర్ 16న పోలీసులు కనిపించకుండా పోయిన ముగ్గురు హత్యకు గురైనట్లు తేల్చారు. నల్లమహారాజు హత్య చేశాడని విచారణలో తెలిసిందన్నారు. కానీ... హత్యకు గురయ్యారని చెప్పిన దివ్య తల్లి, తమ్ముడి మృతదేహాల ఆనవాళ్లను మాత్రం పోలీసులు గుర్తించలేకపోయారు.

పథకం ప్రకారమే తప్పించారా?

అసలు దివ్య కుటుంబం ఎందుకు ఇలా ఛిన్నాభిన్నం అయింది?. చివరికి ఆమె అనైతిక వృత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు లేవనెత్తినప్పుడు.. ఆమె పిన్న కాంతవేణి పాత్ర చాలా అనుమానాస్పదంగా కనిపిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. అసలు 2014 హత్య కేసుల వెనుక డొంకను కదిపేందుకు విచారణ మరింత లోతుగా చేస్తున్నారు. దివ్య కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారా? లేక... వారిని ఎక్కడైనా అమ్మేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దివ్యను ఈ అనైతిక కూపంలోకి లాగేందుకు కుటుంబంలోని వారిని ఒక్కొక్కరిగా తప్పించే ప్రయత్నం జరిగిందేమో అనే కోణంలోను విచారణ సాగుతోంది.

ఇదీ చదవండి :దివ్య హత్యకేసులో మరో ఇద్దరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details