Drug Smuggler Arrested: డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు మరో స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముంబయికి చెందిన మోహిత్‌ను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్.. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మోహిత్‌పై గతంలో రాంగోపాల్‌పేట్ పీఎస్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గోవాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ అడ్మిన్‌తో మోహిత్‌కు పరిచయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మోహిత్ జాబితాలోని డ్రగ్స్ వినియోగదారుల సమాచారం సేకరిస్తున్నారు. అతడితో పాటు నార్కోటిక్ విభాగం పోలీసులు మరో వ్యక్తిని పట్టుకున్నారు.
పోలీసుల అదుపులో మరో డ్రగ్ స్మగ్లర్ - drug case updates
Drug Smuggler Arrested: కొద్దిరోజుల క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో పోలీసులు వేగం పెంచారు. తాజాగా మరో స్మగ్లర్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ముంబయికి చెందిన మోహిత్.. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతడితో పాటు నార్కోటిక్ విభాగం పోలీసులు మరో వ్యక్తిని పట్టుకున్నారు.
డ్రగ్స్