విశాఖ దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్ న్యాయుడిపై చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు.. విశాఖ నగర శాంతిభద్రతల డీసీపీ-1 ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. ఎస్బీఐలో సౌత్ రీజనల్ డైరెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నూతన్ నాయుడు రూ.12 కోట్లు తీసుకున్నట్లు.. మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైనట్లు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితుడు విడతల వారీగా బ్యాంకులో జమ చేసిన స్టేట్మెంట్లతో విచారణ చేస్తున్నామనీ.. అవసరమైతే నూతన్ నాయుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఉద్యోగం పేరిట రూ.12 కోట్లు మోసం చేసిన నూతన్ నాయుడు! - case on nuthan naidu
నూతన్ నాయుడు లీలలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. ఎస్బీఐలో ఉద్యోగం ఇప్పిస్తానని.. రూ.12 కోట్లు తీసుకొని.. నూతన్ నాయుడు మోసం చేశాడని విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
నూతన్ నాయుడుపై మరో కేసు