విశాఖ జిల్లా సీలేరు ఘటనలో మరో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఇప్పటివరకు గల్లంతైన మెుత్తం 8 మంది మృతదేహాలు వెలికితీశారు. సీలేరు నదిలో నిన్న రెండు నాటుపడవలు బోల్తా అయ్యాయి. ఇవాళ లక్ష్మి(26), చింటు(4) మృతదేహాలు బయటకు తీశారు.
సీలేరు నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యం - sileru incident
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని సీలేరు నదిలో సోమవారం రాత్రి జరిగిన దుర్ఘటనలో ఎనిమింది మంది గల్లంతయ్యారు. నిన్న ఆరు మృతదేహాలు వెలికితీయగా.. ఇవాళ మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటివరకు గల్లంతైన 8 మంది మృతదేహలు దొరికినట్లయింది.

సీలేరు ఘటన