విశాఖ జిల్లా పాడేరు మన్యం జి.మాడుగుల మండలం మగతపాలెంలో మాంసాహారం తిని 75 మంది ఆసుపత్రి పాలైన ఘటన తెలిసిందే. ఈ విషయంపై ఆ గ్రామాన్ని అదనపు జిల్లా వైద్యాధికారి లీలా ప్రసాద్ సందర్శించారు. అతిసారం లక్షణాలు ఉన్న మరో 20 మందిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధితుల సంఖ్య 95కు చేరింది. చికిత్స పొందుతున్న వారిని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
అతిసారం లక్షణాలున్న 20 మందిని ఆసుపత్రికి తరలింపు - visakha district latest diarrhea news
జి.మాడుగుల మండలం మగతపాలెంలో మాంసాహారం వల్ల ఆసుపత్రి పాలైన 75 బాధితులను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ పరామర్శించారు. అతిసారం లక్షణాలు ఉన్న మరో 20 మందిని జి. మాడుగుల ఆసుపత్రికి తరలించారు. వీరు త్వరగా కోలుకునేలా చూడాలంటూ వైద్యులను ఆదేశించారు.
బాధితులను పరామర్శిస్తున్న అధికారులు