విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు రెండో రోజు కొనసాగతున్నాయి. దేశ రక్షణ కోసం శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల యాగాన్ని పండితులు వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. వీణావాణీలను చేతపట్టిన అమ్మవారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మహా సరస్వతి అలంకారంలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిచ్చారు.
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ మన్యుసూక్త హోమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. లోక కళ్యాణార్థం వేద పండితులచే చతుర్వేద పారాయణ నిర్వహించారు. వార్షికోత్సవాలను ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి పర్యవేక్షించారు. రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు పీఠార్చన కార్యక్రమాన్ని అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.