Visakha Sarada Peetham Anniversary Celebrations: విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది. 5 రోజులపాటు రాజశ్యామల యాగం, చతుర్వేద హవనం నిర్వహించనున్నారు. పూర్వీకులు ఆస్తిపాస్తులు ఇచ్చినట్లు ఏర్పడిన పీఠం కాదని ఉపాసనా శక్తితో నిర్మాణమైన పీఠం.. విశాఖ శారదాపీఠమని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.
విశాఖ శారదా పీఠంలో వార్షికోత్సవాలు.. రాజశ్యామల యాగం - visakha sarada peetham varshikotsavalu
Visakha Sarada Peetham Anniversary Celebrations: విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో అంకురార్పణ కార్యక్రమం జరిగింది. 5 రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.
విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు
ఉపాసనా విధానం పుస్తకాల్లో దొరికేది కాదని.. వైదికంగా ఎవరో చెబితే వచ్చేది కాదని.. తపస్సు ద్వారా పొందిన శక్తితో పీఠం తయారైందని అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో యావత్ భారతావనిలోనే శక్తివంతమైన పీఠంగా గుర్తింపు పొందిందని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. 5 రోజులపాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. శనివారం యాగానికి రావాల్సిన సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. పంజాబ్, తమిళనాడు రాష్ట్ర గవర్నర్లు హాజరుకానున్నారు.
ఇవీ చదవండి: