విశాఖ జిల్లా చీడికాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లపై వేధింపులు అపాలని వారు నినాదాలు చేశారు. గ్రామాల్లో వాలంటీర్లను, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిజాము అంగన్వాడి ఆయాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ జయప్రకాశ్ రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.
చీడికాడలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన ర్యాలీ - anganwadi teachers protest at chidikada
గ్రామ సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు, అంగన్వాడి కార్యకర్తలపై వేధింపులు అపాలని విశాఖ జిల్లా చీడికాడలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ జయప్రకాశ్ రావుకు వినతిపత్రం అందజేశారు.
ఎంపీడీఓ కు వినతిపత్రం అందజేేస్తున్న అంగన్ వాడి కార్యకర్త
ఇదీచదవండి
కింతాడలో భారీ కొండచిలువ హతం
TAGGED:
vishaka district latest news