అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఫ్రీ స్కూళ్లను కొనసాగించాలని విశాఖ జిల్లా నర్సీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని వార్డు సచివాలయం వద్ద డిమాండ్ చేశారు.
నర్సీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన - latest news of narsipatnam anganwadis agitation
విశాఖ జిల్లా నర్సీపట్నం వార్డు సచివాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
కరోనా కాలంలో అంగన్వాడీలు సమయంతో సంబంధం లేకుండా సేవలు అందిస్తున్నారనీ.. పలుచోట్ల క్వారంటైన్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా బారిన పడి, మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల అద్దె కేంద్రాలకు బకాయిలు చెల్లించలేదనీ.. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:పాత రోజులు ఎప్పుడు వస్తాయో..ఉపాధి ఎప్పుడు దొరుకుతుందో..!