ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో తరగతులను నిర్వహించే విషయంలో యూనివర్సిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆ విభాగాధిపతి ఆచార్య సీఎస్ఎన్ పట్నాయక్ వెల్లడించారు.
తరగతుల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం - ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్తలు
ఏయూలో ఫైన్ఆర్ట్స్ విభాగంలో తరగతులను నిర్వహించే విషయంలో విశ్వవిద్యాలయం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆ విభాగాధిపతి ఆచార్య సీఎస్ఎన్ పట్నాయక్ వెల్లడించారు.
ఆచార్య సీఎస్ఎన్ పట్నాయక్
ఇది పూర్తిగా ప్రాక్టికల్ తరహా కోర్స్ కావడం వల్ల అన్లైన్లో నిర్వహించడం ఎంతవరకు సాధ్యపడుతుందన్న అంశాన్ని విశ్వవిద్యాలయం పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. బిఎఫ్ఎ, ఎంఎఫ్ఎ ప్రవేశాలు త్వరలోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో ప్రిన్సిపాల్ మృతి