ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక మాధ్యమాల్లో ఫొటో పెట్టాడని.. కత్తితో దాడి - knife

తరగతి గదిలో దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంపై విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఫొటో సామాజిక మాధ్యమాల్లో ఉంచాడని కత్తితో దాడి

By

Published : Jul 18, 2019, 1:47 AM IST

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల మధ్య తలెత్తిన తగాదా.. కత్తిపోట్లకు దారితీసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం... విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై.. సహ విద్యార్థి దాడి చేశాడు. కత్తితో పొడిచాడు. మొదటి ఏడాది విద్యార్థులు తరగతి గదిలో దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచడమే ఈ ఘర్షణకు దారి తీసింది. ఇద్దరి మధ్య వివాదం చెలరేగి... దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details