ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వంద శాతం రిజర్వేషన్లు కోరుతూ 29న ఆంధ్ర, తెలంగాణ మన్యం బంద్​'

ఈనెల 29న ఆంధ్ర, తెలంగాణ మన్యం బంద్​కు గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకే 100 శాతం రిజర్వేషన్​కి చట్టబద్ధత కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేసింది.

'వంద శాతం రిజర్వేషన్లు కోరుతూ 29న ఆంధ్ర, తెలంగాణ మన్యం బంద్​'
'వంద శాతం రిజర్వేషన్లు కోరుతూ 29న ఆంధ్ర, తెలంగాణ మన్యం బంద్​'

By

Published : Sep 25, 2020, 4:12 PM IST

సెప్టెంబర్​ 29న ఆంధ్ర, తెలంగాణ మన్యం బంద్​కు గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకే వంద శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంఘం ప్రధాన కార్యదర్శి అప్పలనర్సు డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అనంతరం 9వ షెడ్యూల్​లో చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక డీఎస్సీ కావాలి..

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అప్పలనర్స డిమాండ్ చేశారు. నాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్​లో చేర్చాలన్నారు. పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలని కోరారు.

ఇవీ చూడండి : శోకసంద్రంలో సంగీత ప్రపంచం- ప్రముఖుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details