పాత్రికేయుల అక్రిడేషన్లు మంజూరు చేసే కమిటీల్లో జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యం లేకుండా కేవలం అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ నర్సీపట్నంలో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజేఎఫ్ (ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో జీఓ 123ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
జీఓ 123ను రద్దు చేయాలని పాత్రికేయుల నిరసన - Andhra Pradesh Working Journalist Union Dharna in Narsipatnam
రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాత్రికేయులకు అక్రిడేషన్లు జారీ చేసే విషయంలో పాత్రికేయ యూనియన్ల ప్రమేయం లేకుండా.. కమిటీలో అధికారులే సభ్యులుగా ఉండడాన్ని నిరసిస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు.
జీఓ 123ను రద్దు చేయాలని పాత్రికేయులు నిరసన
ఇవీ చదవండి