ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జీఓ 2ను ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి' - డ్రాయింగ్ ఆఫీసర్ల వ్యవస్థలో మార్పులు

పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓ 2ను తీసుకురావడం సరైన నిర్ణయం కాదని... పంచాయతీ కార్యదర్శులు అన్నారు. వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతూ...విశాఖ జిల్లా దేవరాపల్లిలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడుకు వినతి పత్రం అందచేశారు.

జీఓ 2ను రద్దు చేయాలని ప్రభుత్వ విప్కి​ పంచాయతీ కార్యదర్శుల వినతి
జీఓ 2ను రద్దు చేయాలని ప్రభుత్వ విప్కి​ పంచాయతీ కార్యదర్శుల వినతి

By

Published : Mar 31, 2021, 4:41 PM IST

గ్రామ సచివాలయాల్లో డ్రాయింగ్ డిస్బర్స్​మెంట్ ఆఫీసర్ (డీడీవో) బాధ్యతలను పంచాయతీ కార్యదర్శుల నుంచి గ్రామ రెవెన్యూ అధికారులకు బదలాయింపు చేస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీఓ 2ను రద్దు చేయాలని పంచాయతీ కార్యదర్శులు విశాఖ జిల్లా దేవరాపల్లిలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడును కోరారు. మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల నుంచి వచ్చిన పంచాయతీ కార్యదర్శులు ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

గ్రామ సచివాలయాలు ఏర్పాటైన నాటి నుంచి దిగ్విజయంగా నడిపిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా.. అందర్ని కలుపుకుని చక్కగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓ 2ను తీసుకురావడం సరైన నిర్ణయం కాదని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీఓ నంబర్ 2ను వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details