ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP-ODISHA JOINT MEETING: బలిమెలపై.. ఏపీ, ఒడిశా కీలక నిర్ణయం! - విశాఖపట్నం తాజా వార్తలు

బలిమెల జలాశయం నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఉమ్మడి నిర్వహణలో ఉన్న జలాశయంలోని నీటి నిల్వలు, వినియోగం, పంపకాలపై టెలికాన్ఫరెన్స్‌లో ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు.

బలిమెల నీటిని పొదుపుగా వాడుకోవాలని ఏపీ, ఒడిశా నిర్ణయం
బలిమెల నీటిని పొదుపుగా వాడుకోవాలని ఏపీ, ఒడిశా నిర్ణయం

By

Published : Aug 13, 2021, 3:37 PM IST

బలిమెల జలాశయం నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఉమ్మడి నిర్వహణలో ఉన్న జలాశయంలోని నీటి నిల్వలు, వినియోగం, పంపకాలపై టెలికాన్ఫరెన్స్‌లో ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించారు. ఎవరెవరు ఎంతెంత నీటిని వినియోగించుకుందో లెక్కలు కట్టారు. 2020 -21లో జూలై నుంచి జూన్‌ వరకు ఒడిశా కంటే 21.90 టీఎంసీలు అధికంగా ఏపీ వినియోగించుకుందని నిర్ధరించారు.

ప్రస్తుతం సంవత్సరంలో జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ 4.279 టీఎంసీలు, ఒడిశా 5.093 టీఎంసీలు వాడుకున్నాయి. బలిమెల, జోలాపుట్టు జలాశయాల్లో ప్రస్తుతం 36.25 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తేల్చారు. వీటిలో ఒడిశాకు 28.67 టీఎంసీలు, ఏపీకి 7.58 టీఎంసీలు కేటాయించారు. విద్యుత్‌ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ 2 వేల క్యూసెక్కులు, ఒడిశా 3 వేల క్యూసెక్కుల చొప్పున వినియోగించుకోవాలని ఒప్పందం చేసుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details