ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 19, 2019, 8:10 PM IST

ETV Bharat / state

బలిమెల జలాశయం నీళ్లు... మీకెంత... మాకెంత..!

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని బలిమెల రిజర్వాయర్ నీటి నిర్వహణ, వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాలు వినియోగించిన నీటి వివరాలు, భవిష్యత్తు అవసరాలపై చర్చించారు.

ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం

బలిమెల జలాశయ నీటి వినియోగంపై ఏపీ, ఒడిశా రాష్ట్రాల అధికారుల సమావేశమయ్యారు. ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల రిజర్వాయర్ నిర్వహణ... నీటి వాడకంపై రెండు రాష్ట్రాల అధికారులు సమీక్షించారు. సీలేరు జెన్​కో అతిథిగృహంలో నిర్వహించిన ఈ సమావేశంలో... ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగించుకున్నాయనే అంశంపై చర్చించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎంత నీరు చేరిందని లెక్కలు వేశారు.

సెప్టెంబర్‌లో ఏపీ తన అవసరాల నిమిత్తం 2.39 టీఎంసీలు వాడుకోగా... ఒడిశా 6.14 టీఎంసీలు వాడుకుంది. ఒడిశా 3.74 టీఎంసీల నీటిని అధికంగా వినియోగించుకుందని నిర్ధరణకు వచ్చారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో జోలపుట్, బలిమెల జలాశయాల్లో 127 టీఎంసీలు ఉన్నట్లు లెక్కించారు. ఏపీ వాటాగా 64.28 టీఎంసీలు, ఒడిశా వాటాగా 62.71 టీఎంసీలు నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

2019-20 ఏడాదిలో ఒడిశా కన్నా ఏపీ జెన్​కో అధికంగా 1.54 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు తేల్చారు. ఈ సమావేశంలో ఒడిశా ఓహెచ్​పీసీ తరఫున చీఫ్ జనరల్ మేనేజర్ పాండా, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్​ఎస్​పీ రావు, మేనేజర్లు పాల్గొనగా... ఏపీ జెన్కో తరఫున పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్ రామకోటి వెంకటేశ్వరరావు, ఈఈలు రమేష్, మల్లేశ్వర ప్రసాద్, డీఈఈ బీ.సింహాచలం, సీ.హెచ్ సురేష్​లు పాల్గొనగా... ఒడిశా జలవనరుల శాఖ నుంచి చీఫ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ కృష్ణచంద్రరావు, కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసాద్​నాథ్, పాల్గొన్నారు.

ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం

ఇదీ చదవండీ... 'తెదేపాతో భాజపా ఎప్పటికీ పొత్తు పెట్టుకోదు'

ABOUT THE AUTHOR

...view details