ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులు మూసివేత - ఆంధ్ర ఒడిశా సరిహద్దు మూసివేత న్యూస్

కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోగల డుడుమ జలాశయం వద్ద రాకపోకలు నిలిపివేశారు. జలాశయం నుంచి సంగడ మీదుగా పాడేరు వెళ్లే మార్గానికి అడ్డంగా ఇనుప రాడ్లను వెల్డింగ్‌ చేశారు. మార్గాన్ని మూసివేశారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులు మూసివేత
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులు మూసివేత

By

Published : Apr 3, 2020, 10:49 AM IST

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోగల డుడుమ జలాశయం వద్ద ఉన్న మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. కొద్ది రోజులుగా గేట్లు వేస్తున్నా కొందరు లెక్కచేయకుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జలాశయం నుంచి సంగడ మీదుగా పాడేరు వెళ్లే మార్గానికి అడ్డంగా ఇనుప రాడ్లను వెల్డింగ్‌ చేశారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే సరిహద్దులో గల అరకు సమీపంలో చాటువా వద్ద ఆంధ్ర పోలీసులు భారీ వృక్షాన్ని వేసి మార్గాన్ని మూసివేశారు. తాజాగా డుడుమా వద్ద రాకపోకలకు నిలిపివేయగా.. ఇరు రాష్ట్రాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి.

ABOUT THE AUTHOR

...view details