బలిమెల జలాశయంలో నీటి నిల్వలు, వాడకంపై ఆంధ్రా - ఒడిశా అధికారులు చర్చించారు. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీటి నిల్వలతో విద్యుత్ కేంద్రాలకు ఎటువంటి నీటి సమస్య లేకుండా సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బలిమెల జలాశయంలో 61.58 టీఎంసీల నీరుండగా, జోలాపుట్‌లో 22.69 టీఎంసీలతో మొత్తం 84.27 టీఎంసీలు నీరుంది.
నదీ పరివాహక ప్రాంతాల నుంచి 15 టీఎంసీలు నీరు చేరే అవకాశముందని... 2 జలాశయాల్లో 99.27 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుందని అధికారులు లెక్కలు గట్టారు. ఇందులో ఏపీ జెన్‌కో 42.17 టీఎంసీలు వాడుకోవడానికి ఒడిశా 57.10 టీఎంసీలు నీటిని వాడుకోవడానికి నిర్ణయించారు.