విశాఖ జిల్లా దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసేందుకు యత్నించారు. తహసీల్దార్ కార్యాలయం తాళాలతోపాటు బీరవా తెరిచి రికార్డులన్నీ చిందరవందరగా పడేశారు. సోమవారం సెలవు దినం అయినప్పటికీ కొందరు సిబ్బంది అదే రోజు మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చారు. రికార్డులు చిందరవందరగా పడేసి ఉండటంతో.. వెంటనే సిబ్బంది.. తహసీల్దార్ రమేష్‌బాబుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి కార్యాలయాన్ని పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవరాపల్లి ఎస్సై సింహాచలం , క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. వివరాలను సేకరించారు. పోలీసులు పలువురు సిబ్బందితో మాట్లాడారు. కార్యాలయంలో దొంగలు పడటంతో ఈ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే..