ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ANANDAIAH MEDICINE: 'ఆయుర్వేదం మన పూర్వీకుల నుంచి వచ్చిన గొప్ప వరం' - గోలగాని ఛారిటబుల్ ట్రస్ట్

విశాఖపట్నంలో గోలగాని ట్రస్ట్ నిర్వాహకులు ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా సమయంలో ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా.. ఆయుర్వేద మందును అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ
విశాఖపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ

By

Published : Jul 18, 2021, 9:44 PM IST

ఆయుర్వేదం మన పూర్వీకుల నుంచి వచ్చిన గొప్ప వరం అని విశాఖ గోలగాని ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కొనియాడారు. వనమూలికలతో తయారు చేసిన కృష్ణపట్నం ఆనందయ్య మందు అద్భుతంగా పని చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలో ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేశారు. జనసేన ఉత్తరాంధ్ర సమన్వయకర్త తమిరెడ్డి శివశంకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో ప్రజలకు మందు అందించిన ఆనందయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details