దుకాణాలు తెరిచెేలా చూడాలని ఎమ్మెల్యేకి వినతి - anakapally corona news
అనకాపల్లిలో దుకాణాలు తెరవడానికి అనుమతి కోసం వ్యాపారులు వైకాపా పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో పోలీసులను కలిశారు. అనంతరం ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కి తమ సమస్యను విన్నవించారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో దుకాణాలు తెరవడానికి అనుమతి కోసం వ్యాపారులు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ని కలిశారు. అనికాపల్లి అరెంజ్ జోన్ లో ఉన్న తరుణంలో దుకాణాలు తెరచుకోవచ్చని ఉన్నతధికారులు చెబుతున్నప్పటికి పోలీసులు ఒప్పుకోవడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేలా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ దుకాణాలు తెరిపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.