అమరావతి రైతుల పోరాటం 300వ రోజుకు చేరుకున్న సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సంఘీభావ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాల కార్యచరణపై చోడవరంలో తెదేపా నాయకులను కలిసి చర్చించారు. ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని అన్నారు.
అమరావతి రైతులు ఇచ్చిన 30 వేల ఎకరాలలో రాజధాని నిర్మిస్తే... దేశంలోనే అతిపెద్ద రాజధాని అవుతుందని నాగజగదీశ్వరరావు అభిప్రాయపడ్డారు. రాజధాని ఉద్యమంలో మృతి చెందిన 90 మంది రైతుల కుటుంబాలను ఆదుకోవాలని, దీక్షలు చేస్తున్న మహిళలపై పోలీసు కేసులు ఎత్తి వేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.