రాజధాని కోసం బంగారు భూములను ఇచ్చిన రైతులకు సీఎం జగన్ అన్యాయం చేయడం దారుణమని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు అన్నారు. అమరావతి రైతులు దీక్ష చేపట్టి 400 రోజులు పూర్తైన సందర్భంగా.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా నేతలు దీపాలు వెలిగించి వారికి సంఘీభావం తెలిపారు.
అమరావతి రైతులకు అనకాపల్లి తెదేపా నేతల సంఘీభావం - anakapalli tdp leaders solidarity to amaravati farmers
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని అంగీకరించిన సీఎం జగన్.. ఇప్పడు మాట మార్చడాన్ని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు తప్పుపట్టారు. రైతుల దీక్షకు 400 రోజులు పూర్తికాగా.. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెదేపా నేతలు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు.
![అమరావతి రైతులకు అనకాపల్లి తెదేపా నేతల సంఘీభావం anakapalli tdp leaders support amaravati protests](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10317452-140-10317452-1611160126124.jpg)
30 వేల ఎకరాలుంటే రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంగీకరిస్తామని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ చెప్పినట్లు ఎమ్మెల్సీ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం తగదన్నారు. చంద్రబాబునాయుడికి మంచి పేరు వస్తుందని.. ముఖ్యమంత్రి మూడు ముక్కలాట ఆడుతున్నారని ఆరోపించారు. కార్యనిర్వాహక రాజధాని వచ్చినంత మాత్రాన విశాఖపట్నం బాగుపడదని చెప్పారు. ఈ తరహా నిర్ణయాల వల్ల ఇప్పటికే రాష్టం నుంచి పరిశ్రమలు తరలి పోతున్నాయన్నారు.
ఇదీ చదవండి:విద్యుత్ టారిఫ్‌పై ఉత్తర్వులు ఇస్తాం: జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి