కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ... దిల్లీలో నిర్వహించిన రైతుల దీక్షలో ఆదివారం అనకాపల్లి వాసులు పాల్గొన్నారు. వీరు సోమవారం ఉదయం 11 గంటల వరకు నిరాహారదీక్షలో కూర్చుంటారు. అనకాపల్లి నుంచి వెళ్లిన ఎఐకేఎస్ నాయకులు సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజశేఖర్, చలపతి దీక్షలో కూర్చున్నట్లు తెలిపారు. రైతాంగానికి అన్యాయం చేసే 3 వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దిల్లీ దీక్షలో అనకాపల్లి వాసులు - farmers agitation news
దిల్లీలో రైతులు చేపట్టిన దీక్షలో అనకాపల్లి వాసులు పాల్గొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దిల్లీ దీక్షలో అనకాపల్లి వాసులు