కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విశాఖ జిల్లా అనకాపల్లి పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహించారు. భౌతిక దూరం పాటించాలని కోరుతూ వినూత్న ప్రచారం చేపట్టారు. స్థానిక చిత్రకారులతో రహదారులపై కరోనా చిత్రాలు గీయించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యులు, పోలీసులు, విలేకరులు, పారిశుద్ధ్య కార్మికులందరూ కలిసి రాష్ట్రంలో కరోనా విజృంభించకుండా కాపాడుతున్నట్లు గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.
కరోనాపై విస్తృత ప్రచారం.. రోడ్డుపై చిత్రాలతో ప్రయత్నం - రోడ్డుపై చిత్రాలతో కరోనాపై అనకాపల్లి పోలీసుల ప్రచారం
విశాఖ జిల్లా అనకాపల్లి పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. రహదారులపై వైరస్‌కు సంబంధించిన బొమ్మలు గీయించారు.

కరోనా వైరస్ గురించి అనకాపల్లి రహదారిపై వేసిన బొమ్మ