విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులకు కరోనా అనుమానిత లక్షణాలు బయట పడ్డాయి. పరీక్ష చేయించుకున్న ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులకు కరోనా సోకినట్లు నిర్థరణ కావడంతో.. సిబ్బంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, నర్సులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరి ఫలితాలు రావాల్సి ఉంది.
అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులకు కరోనా - anakapalli ntr hospital news
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
anakapalli ntr hospital