విశాఖ జిల్లా అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లిలోని ఉడ్పేట ప్రాథమిక పాఠశాలలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం మండలంలోని సుందరయ్యపేట ప్రాంతంలో పదెకరాల స్థలాన్ని కేటాయించారు. పాఠశాలను అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి పరిశీలించి... సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 5న కేంద్రీయ విద్యాలయం కేంద్ర కమిటీ పాఠశాలలను పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఎంపీ వెల్లడించారు.
అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు - అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
విశాఖ జిల్లా అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరంలోనే విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి తెలిపారు.
అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
ఇదీ చదవండి: