ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించండి: ఎంపీ - MP Dr Satyavathi visited the Anakapalli NTR District Hospital

అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులను అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

MP Dr Satyavathi visited the Anakapalli NTR District Hospital
కొవిడ్ రోగులను పరామర్శించిన అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి

By

Published : May 21, 2021, 10:23 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో పర్యటించిన ఎంపీ... వైరస్ బాధితులను పరామర్శించారు. మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన వ్యాక్సినేషన్​ ప్రక్రియను పరిశీలించారు. విజయరామరాజుపేటలో జ్వరాల సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి అనుమానిత లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details