కరోనా సోకిన వారికి వైద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అలాగే ఇది ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూచించారు. మధ్యాహ్నం 12 లోపు అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో అమలవుతున్న కర్ఫ్యూను ఆయన పరిశీలించారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఉధృతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారని.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.