ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారు' - anakapalli mla amarnath news

తెదేపా అధినేత చంద్రబాబుపై అనకాపల్లి ఎమ్మెల్యే అమర్​నాథ్​ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొడుతూ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

anakapalli mla fires on chandrababu
చంద్రబాబుపై ఎమ్మెల్యే అమర్​నాథ్ ధ్వజం

By

Published : Jan 7, 2020, 6:07 PM IST

చంద్రబాబుపై ఎమ్మెల్యే అమర్​నాథ్ ధ్వజం

తెదేపా అధినేత చంద్రబాబుపై విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే అమర్​నాథ్ ధ్వజమెత్తారు. వైకాపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడని ఆయన.. అమరావతిలో చంద్రబాబు అతని అనుచరులు భూములపై భారీగా పెట్టుబడులు పెట్టి అవి కోల్పోతామనే భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. 70 ఏళ్లు పైబడిన చంద్రబాబు నైతిక విలువలు మరచిపోయారని దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణ సమయంలో ఒక్క రూపాయి విరాళం ఇవ్వని చంద్రబాబు భార్య భువనేశ్వరి... ఇప్పుడు ఆ ప్రాంత రైతులకు రెండు గాజులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి నుంచి రాజధానిని తొలగిస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని...ఎమ్మెల్యే మరోసారి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details