రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు - నేడు పనుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అధికారులను హెచ్చరించారు. అనకాపల్లి నియోజకవర్గంలో చేపడుతున్న మనబడి నాడు - నేడు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలను తాను పరిశీలిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. నాణ్యత ఎక్కడ లోపించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఇంజfనీరింగ్ అధికారులతో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.