భూ రికార్డులను ట్యాంపర్ చేసి స్థలాలు కాజేసేందుకు జరిగిన ప్రయత్నాలపై... 2017 నుంచి పోరాడుతున్నామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖ భూ కుంభకోణం వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ఆయన ఫిర్యాదు చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములు అన్యాక్రాంత విషయమై... సిట్ అధికారులను కలిసి వివరాలతో ఆధారాలు అందజేశామని అమర్ తెలిపారు.
సిట్‌కు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ ఫిర్యాదు - anakapalli mla amarnath sit compalint news in visakhapatnam
విశాఖ భూ కుంభకోణాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఫిర్యాదు చేశారు.
anakapalli-mla-amarnath-compalint-to-sit-team