అనకాపల్లి తెదేపా కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా
బుధవారం జరగాల్సిన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. రేపు తెదేపా రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడంతో వాయిదా వేస్తున్నట్లు తెదేపా నేతలు ప్రకటించారు.
విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభం వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేతులమీదుగా బుధవారం కార్యాలయం ప్రారంభించాల్సి ఉండగా... మంగళవారం తాడేపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. అంతేగాక విశాఖ, తిరుపతిలో తెదేపా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కార్యాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు తెదేపా నేతలు చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు.