విశాఖ జిల్లా అనకాపల్లి సబ్ డివిజన్లో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు అభినందించారు. ఆమెను సత్కరించారు. కరోనా సమయంలో పోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని.. ప్రజలకు తగిన అవగాహన కలిగిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు బొడ్డేడ అప్పారావు, బొట్టా చిన్ని యాదవ్, ఆళ్ల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
అనకాపల్లి డీఎస్పీకి ప్రజా సంఘాల నేతల సత్కారం - అనకాపల్లి తాజా కొవిడ్ వార్తలు
కరోనా సమయంలో అనకాపల్లిలో లాక్డౌన్ ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారంటూ.. డీఎస్పీ శ్రావణిని ప్రజా సంఘాల నాయకులు అభినందించారు. సత్కరించారు.
![అనకాపల్లి డీఎస్పీకి ప్రజా సంఘాల నేతల సత్కారం anakapalle dsp honored by public society people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7038314-199-7038314-1588484858212.jpg)
డీఎస్పీ శ్రావణిని సత్కరిస్తున్న ప్రజా సంఘాల సభ్యులు