ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెడికల్ కళాశాల స్థలాన్ని పరిశీలించిన అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే - ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వార్తలు

విశాఖ జిల్లా వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థలంలో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు 31వ తేదీన సీఎం జగన్​ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి స్థలాన్ని అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అమర్నాథ్​ పరిశీలించారు.

inspection
మెడికల్ కళాశాల స్థలాన్ని పరిశీలించిన అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే

By

Published : May 28, 2021, 5:56 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థలంలో నిర్మించనున్న మెడికల్ కళాశాల స్థలాన్ని ఎంపీ డాక్టర్.బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ఈ నెల 31వ తేదీన వర్చువల్ విధానంలో అనకాపల్లి మెడికల్ కళాశాలకి సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు సీఎం జగన్మోహన్​రెడ్డి చొరవ చూపడం పట్ల ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు దాడి రత్నాకర్, దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామ రాజు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details