ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం - vishakapatnam latest news

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఓ మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించారు. ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని బయటకు తీశారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం
విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం

By

Published : Sep 23, 2020, 6:33 PM IST

విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఓవ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మత్స్యకారులు బోట్లు నిలిపే 3వ నెంబర్ జెట్టి వద్ద ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. అది గమనించిన మత్స్యకారులు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పుర్రె, ఎముకలతో మృతదేహం బయటపడటంతో ఆ వ్యక్తి ఎవరనేది గుర్తు పట్టేందుకు చాలా కష్టతరమవుతోందని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా.. అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details