ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుంపటిలో మంటలు రేగి వృద్ధురాలు మృతి - old women died news

చలి కోసం రక్షణగా పెట్టుకున్న కుంపటి.. ఆ వృద్ధురాలిని బలి తీసుకుంది. నిద్రలోనే ఆమె ప్రాణం అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో జరిగింది.

an old women died
మృతి చెందిన వృద్ధురాలు

By

Published : Dec 2, 2020, 3:10 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లిలో ప్రమాదం జరిగింది. చలి నుంచి రక్షణగా వేసుకున్న కుంపటిలో మంటలు రేగి ఓ వృద్ధురాలు నిద్రలోనే మృతి చెందింది. నక్కపల్లికి చెందిన లోడ నాగాయమ్మ (69) రాత్రి పడుకునేప్పుడు మంచం కిందే కుంపటి పెట్టుకుని నిద్రపోయింది. ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకోవడంతో తీవ్రంగా గాయపడి మరణించింది. ఉదయం ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details