విశాఖ జిల్లా చీడికాడ మండలంలో దారుణం జరిగింది. మండలంలోని ఓ గ్రామంలో బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పశువుల పాకలో హల్వా ఉందని బాలికను నమ్మించి తీసుకెళ్లిన అతను... అఘాయిత్యానికి యత్నించాడు. భయానికి గురైన బాలిక పెద్దగా కేకలు వేసింది. సమీపంలోని రైతులు, యువత వచ్చి వృద్ధుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చీడికాడ ఎస్ఐ సురేశ్ కుమార్ చెప్పారు.
బాలికపై 75 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం - విశాఖ నేర వార్తలు
హల్వా ఆశ చూపి ఓ బాలికపై విశాఖ జిల్లాలో వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
An old man try rape a girl in vishaka patnam district