ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్ ఆపేశారని వృద్ధుడి నిరసన - విశాఖ తాజా వార్తలు

ఐదు నెలలుగా పింఛన్ ఇచ్చి ఆకస్మాత్తుగా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ.... విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కూండ్రంలోని సచివాలయం వద్ద ఓ వృద్ధుడు నిరసనకు దిగారు.

pension stopped
పింఛన్ ఆపేశారని వృద్ధుడి నిరసన

By

Published : Jan 1, 2021, 10:21 PM IST


అనకాపల్లి మండలం కూండ్రం పంచాయతీకి చెందిన సేనాపతి గంగు నాయుడు(61)కి ఐదు నెలలుగా పింఛన్ ఇస్తూ... జనవరి ఒకటో తేదీన నుంచి అధికారులు ఆపేశారు. దీనిని నిరసిస్తూ బాధితుడు గ్రామ సచివాలయం వద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

వైకాపా అభిమానిగా ఉన్న తనకు స్థానికంగా కొంతమంది నాయకులు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ పింఛన్ ఆపేశారని బాధితుడు ఆరోపించారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనుచరుడిగా సేనాపతి గంగు నాయుడు ఆర్ఇసీఎస్ మాజీ డైరెక్టర్​గా పని చేశారు. తనకు గుండె ఆపరేషన్ అయిందని ఆర్థికంగా చితికిపోయిన తనకు ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పింఛనే గతని వృద్ధుడు వాపోయాడు.

తనకు వయస్సు సరిపోలేదని చెబుతున్నారని అయితే ఐదు నెలలుగా పింఛను ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తాను పింఛన్ అందుకోవడానికి తగిన వయస్సు, అన్ని అర్హతలు ఉన్నాయని తనపై కొంతమంది అధికారులు, వాలంటీర్ కక్షకట్టి పెన్షన్ రాకుండా చేస్తున్నారని గంగు నాయుడు ఆరోపించారు. దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details