విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన యువకుడు బర్రె అర్జునరావుకు మతిస్థిమితం లేదు. చనిపోతానని భయపెడుతూ పరిగెత్తేవాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే చనిపోతానని పరిగెత్తుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. ఈత రాక బావిలో మునిగి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాడుగుల ఎస్సై రామారావు తెలిపారు.
మతిస్థిమితం లేని యువకుడు బావిలో పడి మృతి
మతి స్థిమితం లేని యువకుడు.. కొద్ది రోజులుగా చనిపోతానని భయపెడుతూ.. పరిగెత్తేవాడు. చివరకు బావిలో కాలుజారి పడిపోయి.. ఈత రాక మృతి చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరనారాయణంలో జరిగింది.
మతిస్థిమితం లేని యువకుడు బావిలో పడి మృతి