విశాఖ జిల్లా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులో మతిస్థిమితం లేని ఓ మహిళ ఇనుప రాడ్డుతో హల్చల్ చేసింది. దారిలో కనిపించిన వారిపై దాడికి యత్నించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులకు సైతం చుక్కలు చూపించింది. చివరకు ఆమెను పట్టుకొని ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ.. కిలగాడ గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు.
మతిస్థిమితం లేని మహిళ ఇనుప రాడ్డుతో హల్చల్ - విశాఖ జిల్లా నేటి వార్తలు
విశాఖ మన్యం పాడేరులో మతిస్థిమితం లేని ఓ మహిళ ఇనుప రాడ్డుతో అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వాళ్లకు చుక్కలు చూపించింది.
![మతిస్థిమితం లేని మహిళ ఇనుప రాడ్డుతో హల్చల్ An insane woman rooming with rods at paderu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11167729-300-11167729-1616753716498.jpg)
మతిస్థిమితం లేని మహిళ హల్చల్
పాడేరులో మతిస్థిమితం లేని మహిళ హల్చల్