ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో నిజాయతీ చాటుకున్న మహిళ - anakapalli latest news

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ మహిళ నిజాయతీ చాటుకుంది. ఒక యువతి పోగొట్టుకున్న బ్యాగ్​ను పోలీసులకు అందించి అభినందనలు పొందింది.

anakapalli police station
పోలీసులకు బ్యాగ్​ అప్పగిస్తున్న మహిళ

By

Published : Jan 3, 2021, 9:15 AM IST

అనకాపల్లిలోని శారదా కాలనీ వద్ద పావని అనే యువతి ద్విచక్రవాహనంపై వెళ్తూ.. తన బ్యాగ్ పోగొట్టుకుంది. అందులో బంగారు వస్తువులు, రూ.4,500 నగదు, చరవాణి ఉన్నాయి. అదే కాలనీకి చెందిన దుర్గాదేవి అనే మహిళ బ్యాగ్​ను గుర్తించి.. పట్టణ పోలీస్​స్టేషన్​లో అప్పగించింది. విలువైన వస్తువులు ఉన్నప్పటికీ నిజాయతీగా బ్యాగ్​ను.. తీసుకొచ్చి ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details