ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ రికార్డుల్లో లేని గ్రామం... ఈటీవీ చొరవతో వెలుగులోకి - బందలపనుకు నేటి వార్తలు

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70ఏళ్లవుతున్నా ఇప్పటికీ అధికారికంగా గుర్తింపు పొందని గ్రామం ఉందంటే ఊహించగలరా...! మౌలిక సదుపాయాలకు నోచుకోలేక... గ్రామస్థులకు ఓటరు కార్డులు సైతం లేవంటే నమ్మగలరా....! బాహ్య ప్రపంచానికి ఇంత దూరంగా ఉన్న ఊరేంటి....?అక్కడ వారి జీవన పరిస్థితులపై ఈటీవీ-భారత్​ ప్రత్యేక కథనం.

An ETV team identified a village that was not on government records in vizag district
విశాఖపట్నం జిల్లా బందలపనుకు గ్రామస్థులు

By

Published : Oct 16, 2020, 7:24 PM IST

Updated : Oct 16, 2020, 9:18 PM IST

మన్యం ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ గడిపే బతుకులు... మంచినీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా పొందలేని ప్రజలు. ఇతర ప్రాంతాలకు చేరుకునే దారిలేక... విద్యకు సైతం నోచుకోలేక... ఏళ్లుగా ఇదే సమస్యలతో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయితీలోని బందలపణుకు గ్రామస్థులు జీవనం సాగిస్తున్నారు. అక్కడి ప్రజల పరిస్థితి విన్న మండల అభివృద్ధి అధికారి వెంకన్నబాబు... మరికొందరు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

రహదారి మార్గం లేక... వాహనాల ప్రసక్తే లేక... కొండలు, గుట్టలను లెక్క చేయకుండా కాలినడకన ప్రయాణం సాగించారు. సాహసయాత్రను తలపించే ఈ గమనంలో... శరీరానికి అలసట ముంచుకొస్తున్నా... మార్గమధ్యంలో అడ్డం వచ్చే జలపాతాలను దాటుకుంటూ సుమారు 4గంటల పాటు ప్రయాణించి... బందలపణుకు చేరుకున్నారు.

విశాఖపట్నం జిల్లా బందలపనుకు గ్రామస్థులు

అధికారుల రాకతో ఆశ్చర్యపోయిన స్థానికులు... ఇంతవరకూ ఏ ఒక్కరూ తమను పట్టించుకున్న సందర్భాలు లేవని వాపోయారు. మౌలిక సదుపాయాలు సైతం అందడం లేదని అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికుల సమస్యలు తెలుసుకున్న ఎంపీడీవో వెంకన్నబాబు... ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలన్నీ గిరిజనులకు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

జూరాల ప్రాజెక్టు నీరు దిగువకు విడుదల

Last Updated : Oct 16, 2020, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details