ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి అవంతి-ద్రోణంరాజు శ్రీనివాస్​ మధ్య వాగ్వాదం - talks war

విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్​ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి మాటలకు ద్రోణంరాజు ఘాటుగా స్పందించారు. సభా మర్యాదలను పాటించాలని.. చిన్నా పెద్దా తేడా తెలుసుకోవాలని మంత్రికి సూచించారు.

వాగ్వాదం

By

Published : Sep 30, 2019, 10:40 PM IST

మంత్రి అవంతి, ద్రోణంరాజు మధ్య వాగ్వాదం

విశాఖ నగరంలోని ఏయూ కన్వెన్షన్‌ హాలులో గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి అవంతి శ్రీనివాస్‌, వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు నియమామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌, ద్రోణంరాజు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అవంతి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటూ ఎంపికైన అభ్యర్థులకు సూచించారు. ఓ సందర్భంలో వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజును ఉద్దేశిస్తూ అవంతి చేసిన వ్యాఖ్యలు స్వల్ప వాగ్వాదానికి దారితీశాయి. నగరంలో పెరిగిన ఆయనకు గ్రామాల్లోని సమస్యలు తెలియవని మంత్రి అవంతి అన్నారు.

ఆ తర్వాత మాట్లాడిన ద్రోణంరాజు శ్రీనివాస్‌ అవంతి వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా గ్రామస్థాయి నుంచే వచ్చామని.. తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ గ్రామ కరణం, సర్పంచ్‌, ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్‌, ఎంపీగా పని చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎంతోమందితో తమకు స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మంత్రి అవంతి సభా మర్యాదలను పాటించాలని.. చిన్నా పెద్దా తేడా తెలుసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. అనంతరం అవంతి మాట్లాడుతూ తన మాటలను ద్రోణంరాజు అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details