పది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ సంపదను పెంచే ఉత్పత్తులపై ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరముందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. విశాఖలో చిరుధాన్యాలకు సంబంధించిన అమూల్యం మిల్లెట్ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని సూచించారు. ప్రపంచ మార్కెట్‌ను శాసించే ఆహారధాన్యాల ఉత్పత్తికి రైతులు చొరవ చూపాలని కోరారు. పదిమందికి అన్నంపెట్టే వ్యవసాయాన్ని, ఉపాధి మార్కెట్ అవకాశాలను పెంచే వాటిపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.
విశాఖలో అమూల్యం.. మిల్లెట్ కిచెన్
విశాఖలో చిరుధాన్యాలకు సంబంధించిన అమూల్యం మిల్లెట్ కిచెన్‌ను లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని సూచించారు.
విశాఖలో అమూల్యం మిల్లెట్ కిచెన్