ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ పుట్టినరోజు పండగ వేడుకలు నిరాడంబరంగా పూర్తయ్యాయి. విశాఖ జిల్లా పాడేరులోని ఈ ఆలయంలో.. లాక్ డౌన్ కారణంగా వేడుకలను కొద్ది మంది సమక్షంలోనే నిర్వహించారు.
పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పూజలు చేశారు. మూడో రోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా గుడి చుట్టూ విగ్రహాన్ని ఊరేగించారు. కరోనా నివారించాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.